రాజమండ్రి విమానాశ్రయంలో టెర్మినల్ కూలిన ప్రాంతాన్ని రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా విమానాశ్రయ అధికారులతో మాట్లాడి జరిగిన ప్రమాదంపై ఆరా తీశారు. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని వారిని ఆదేశించారు. మరల ఇలాంటి ప్రమాదం పునరావృతం జరగరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో విమానాశ్రయ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.