'గాజు గ్లాస్' గుర్తు ఇప్పటికీ ఫ్రీ సింబల్: మేడా శ్రీనివాస్

51చూసినవారు
'గాజు గ్లాస్' గుర్తు ఇప్పటికీ ఫ్రీ సింబల్ గానే ఉందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ ఈరోజు ఓ ప్రముఖ పత్రికలో 'గాజు గ్లాస్' గుర్తు జనసేన పార్టీకి కేటాయించారని దీనిని ఇతరులకు కేటాయించటం కుదరదని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపినట్టు వచ్చిన వార్తలో యదార్ధం లేదన్నారు. దీన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్