తగ్గుముఖం పట్టిన గోదావరి వరద

70చూసినవారు
తగ్గుముఖం పట్టిన గోదావరి వరద
గోదావరి వరద పూర్తిగా తగ్గుముఖం పట్టింది. దీంతో రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి వరద నీటిమట్టం శనివారం ఉదయం 7 గంటలకు 11 అడుగులకు చేరింది. 8, 88, 353 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో అధికారు మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. మరోవైపు భద్రాచలం వద్ద 38. 80 అడుగుల వద్ద నీటిమట్టం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్