పండ్ల వ్యాపారి మణికంఠను కత్తితో బెదిరించి దొంగతనానికి పాల్పడిన కేసులో కొంతమూరుకు చెందిన బలరామ్, యేసు అనే పాత నేరస్థులను అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్ బుధవారం తెలిపారు. రాజమండ్రిలో ఎస్పీ తెలిపిన వివరాలు ప్రకారం ఈ నెల 22న రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో నిందితులు దొంగతనానికి పాల్పడ్డారు. వారి నుంచి బంగారు ఉంగరాలు, రూ. 4 వేలు నగదు, సెల్ ఫోను స్వాధీనం చేసుకున్నామన్నారు.