మే 1 నుంచి వాలీబాల్ శిక్షణ

57చూసినవారు
రాజమండ్రి వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మే 1వ తేదీ నుంచి స్థానిక ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలోని పరిమి రామచంద్రరావు మెమోరియల్ ఫ్లడ్ లైట్ వాలీబాల్ కోర్టులో వేసవి వాలీబాల్ శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి కె. యశ్వంత్ శనివారం తెలిపారు. పదేళ్లు పైబడిన బాలురు, బాలికలు శిక్షణకు అర్హులన్నారు. ఆసక్తి కలవారు బుధవారం ఉదయం 6 గంటలకు ఆధార్ కార్డు జిరాక్స్ తో హాజరుకావాలని కోరారు.

సంబంధిత పోస్ట్