కడియం మండలం కడియపులంక గ్రామ శివారులో నాటు సారా తయారీ కేంద్రాలపై కడియం సీఐ ఏ. వెంకటేశ్వరరావు, ఎస్సై నాగ దుర్గ ప్రసాద్ మంగళవారం తమ సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఈ దాడిలో భాగంగా నాటు సారా తయారు చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి 250 లీటర్ల నాటు సారా, ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే సారా తయారీకి ఉపయోగపడే 5000 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు.