కడియం మండలం దుళ్ళ గ్రామంలో చేతి పంపులు పూర్తిగా పాడైపోయిన పట్టించుకునే నాధుడే లేడని గ్రామస్తులు వాపోతున్నారు. వేసవి నేపథ్యంలో రిపేర్లతో చేతిపంపులు ఉన్న పంచాయతీ అధికారులు నిర్లక్ష్య ధోరణితో ప్రజలకు మంచినీటిని అందించలేని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి సమస్యపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.