రాష్ట్రంలో నూతన ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి స్కీం వర్కర్లు, చిరుద్యోగులపై జరుగుతున్న రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులను తక్షణం నిలుపుదల చేయాలని సీఐటీయూ సభ్యులు డిమాండ్ చేశారు. సోమవారం రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు జిల్లా కలెక్టరేట్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో స్కీం వర్కర్లు, చిరు ఉద్యోగులు మండుటెండలో నిరసన వ్యక్తం చేశారు. వివిధ రంగాల కార్మికులను అక్రమంగా తొలగిస్తున్నారని ఆరోపించారు.