రాజమండ్రి రూరల్ 2వ మండలం బీజేపీ అధ్యక్షుడిగా కవలగొయ్య గ్రామానికి చెందిన మట్టా నాగబాబు బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2వ మండల బీజేపీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న బీజేపీ మండలం బూత్ అధ్యక్షులకు, క్రియాశీలక సభ్యులకు, నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ అభ్యున్నతికి నిబద్ధతతో పనిచేస్తానని అన్నారు. మండలంలో ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తానని అన్నారు.