రేపు తూ.గో జిల్లా కలెక్టరేట్ వద్ద జాబ్ మేళా

66చూసినవారు
రేపు తూ.గో జిల్లా కలెక్టరేట్ వద్ద జాబ్ మేళా
ఈ నెల 24వ తేదీన రాజమండ్రి రూరల్ మండలంలోని బొమ్మూరులో గల జిల్లా కలెక్టరేట్ వద్ద జాబ్ మేళా నిర్వహించనున్నట్లు వికాస పీడీ కె. లచ్చారావు మంగళవారం తెలిపారు. ఈ జాబ్ మేళాలో పలు ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని వెల్లడించారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లమా, బీటెక్ అర్హత కలిగిన 30 ఏళ్లలోపు అభ్యర్థులు అర్హులన్నారు. ఈ జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్