రంగంపేట మండలం వడిసలేరులో జిఎస్ఎల్ ఆసుపత్రి ఛైర్మన్ భాస్కరరావు ఆధ్వర్యంలో గన్ని సత్యనారాయణ మూర్తి స్మారక రాష్ట్రస్థాయి ఎడ్ల బండ్ల పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మంత్రి కందుల దుర్గేష్, మాజీ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎడ్లబండ్ల పోటీలు హోరా హోరీగా సాగుతున్నాయి. 1600, 1000 మీటర్ల విభాగాల్లో పోటీల్లో 80 జతల ఎద్దులు పోటీలో పాల్గొన్నాయి.