రామ‌చంద్రాపురంలో తప్పిన ఘోర అగ్ని ప్రమాదం

30261చూసినవారు
రామ‌చంద్రాపురంలో బుధవారం కారు దగ్ధం అయ్యి పెను ప్రమాదం తగ్గింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసారు. బుధవారం స్థానిక ఆర్ ఎస్ వి వి దుర్గాప్రసాద్ కాకినాడ నుంచి రామచంద్రపురం వస్తుండగా ప్రాఫిట్ షూ మార్ట్ వద్దకు వచ్చేసరికి తన మారుతి 800 కారు ఇంజన్ నుంచి మంటలు చెలరేగాయి. ఆయన కారులో నుంచి బయటపడడంతో ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్