భారతదేశ పూర్వ ప్రధాని, భారతరత్న దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ బుధవారం ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రామచంద్రపురంలో జరిగిన వాజ్‌పేయి జయంతి వేడుకల్లో పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ ప్రధానిగా ఆదర్శవంతమైన పాలన అందించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.