తమ సమనస్యలు పరిష్కరించి. వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వాలంటీర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎటపాక ఎంపీడీవో కార్యాలయం ఎదుట మంగళవారం అర్ధనగ్న ప్రదర్శనతో ధర్నా నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ. 10 వేల వేతనంతో విధుల్లోకి తీసుకోవాలని కోరారు. అనంతరం ఎంపీడీవోకు వినతిపత్రం ఇచ్చారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మాధవరావు వాలంటీర్లకు మద్దతు తెలిపారు.