రంపచోడవరం: ఎన్. ఎస్.ఎస్. ఆధ్వర్యంలో వృద్ధులకి దుప్పట్లు పంపిణీ

69చూసినవారు
రంపచోడవరం: ఎన్. ఎస్.ఎస్. ఆధ్వర్యంలో వృద్ధులకి దుప్పట్లు పంపిణీ
రంపచోడవరం మండలం చినబారంగి గ్రామంలో మంగళవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్. ఎస్.ఎస్ విద్యార్థులు ప్రిన్సిపాల్ డా.కె. వసుద ఆధ్వర్యంలో వృద్ధులకు దుపట్లు పంపిణీ చేశారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ వృద్ధులు చలికాలంలో ఇబ్బందులు పడకుండా ఉండటానికి తమవంతు సహాయం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్. ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డి.రవికుమార్, స్థానిక ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్ జి.విశ్వరాజ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్