మహిళలు క్రీడలలో మరింతగా రాణించాలని ఆకాంక్షిస్తున్నట్లు రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ తెలిపారు. ఆయన ఆదివారం రాత్రి మలికిపురం మండలంలోని తూర్పు పాలెం వద్ద అడబాల స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళల ప్రీమియర్ వాలీబాల్ టోర్నమెంట్ విజేతలను అభినందించారు. విజేతలైన మహిళల జట్టులకు ఆయన ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు పాల్గొన్నారు.