మామిడికుదురు: గ్రామాల్లో మొదలైన హరిదాసుల సందడి

84చూసినవారు
ధనుర్మాసం ప్రారంభం కావడంతో మంగళవారం హరిదాసుల సందడి గ్రామాల్లో మొదలైంది. సంక్రాంతి వరకు హరిదాసులు ఇంటింటికీ తిరుగుతూ హరినామ కీర్తనలతో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పంచుతారు. మామిడికుదురు మండల పరిధిలోని గ్రామాల్లో హరిదాసులు మోటారు వాహనాలపై తిరుగుతూ స్పీకర్ల ద్వారా హరినామ స్మరణను వినిపిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వాహనాల ముందు భాగంలో అక్షయపాత్రలతో భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతున్నారు.

సంబంధిత పోస్ట్