మలికిపురం: జనావాసాల మధ్య మద్యం షాపు తొలగించాలంటూ నిరసన

72చూసినవారు
జనావాసాల మధ్య ఉన్న మద్యం షాపును వెంటనే తొలగించాలంటూ స్థానికులు శుక్రవారం నిరసన తెలియజేశారు. మలికిపురం మండలం పరిధిలోని గూడపల్లి-కేశనపల్లి ప్రధాన రహదారి చెంతనే ఉన్న మద్యం షాపు వలన ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోయారు. రోడ్డుపై వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, పాఠశాల విద్యార్థులు సైతం అదే రహదారిలో వెళ్లవలసి వస్తుందంటూ మద్యం షాపును తొలగించాలంటూ ధర్నా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్