పేదలందరికీ మెరుగైన వైద్యాన్ని అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం రాజోలు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రేవు జ్యోతి, స్థానిక కూటమి నాయకులు, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.