పారిశుద్ధ్య కార్మికుల సేవలు విశిష్ఠమైనవని, ప్రతిరోజూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్నారు. సోమవారం రాజోలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వద్ద పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కార్మికుల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు.