సఖినేటిపల్లి మండలం ఉయ్యూరువారి మెరక గ్రామానికి చెందిన వైసీపీ స్టూడెంట్ విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు తాడి సహదేవ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. విద్యార్థుల సమస్యలపై పోరాటం చేయాలని ఈ సందర్బంగా జగన్ సూచించారని పేర్కొన్నారు. సహాదేవ్ తో పాటుగా వైసీపీ నాయకులు గొల్లపల్లి శ్రీధర్ ఉన్నారు.