రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేడ్కర్ ని అవమానిస్తూ వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రిని వెంటనే పదవి నుంచి తొలగించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కోటనందూరు ఎమ్మార్వో కార్యాలయం ఎదుట సోమవారం సీఐటీయూ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్అను వెంటనే పదవి నుంచి తొలగించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు.