సంక్రాంతి సంబరాల్లో భాగంగా వైస్ ఎంపీపీ కొరుప్రోలు రమణమ్మకృష్ణ ఆధ్వర్యంలో కోటనందూరులోని పెద్దరామాలయం వద్ద ఆదివారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీలో పెద్దఎత్తున యువతులు, మహిళలు, విద్యార్థినులు పాల్గొని రంగురంగుల రంగవల్లులు వేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోటనందూరు ఎస్ఐ అశోక్ పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. పోటీలో పాల్గొన్నవారందరికీ కన్సోలేషన్ బహుమతులు అందజేశారు. కార్యక్రమానికి సహకారమందించిన రైతు రాజ్యం యూత్ సభ్యులకు వైస్ ఎంపీపీ కృష్ణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రైస్ మిల్ యాజమాని శెట్టి శ్రీను, పడాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.