కోటనందూరు మండలం కొత్తకొట్టాం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శనివారం మెగా పేరెంట్స్, టీచర్స్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ చిటికెల సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం అన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో పాఠశాలలో ఆత్మీయ సమావేశాలను సరదా వాతావరణంలో జరుపుకోవడం అభినందనీయమన్నారు.