తుని ఎమ్మెల్యే యనమల దివ్య నియోజకవర్గంలో వైద్య సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న మూడు పేద కుటుంబాలకు మంజూరైన చెక్కును తుని మండలం తేటగుంట టీడీపీ కార్యాలయంలో బుధవారం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరిని కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మోతుకూరి వెంకటేష్, కుసుమంచి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.