వానపల్లి లో బిజెపి నేతలు ఇంటింటి ప్రచారం
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లి గ్రామం లో మంగళవారం బిజెపి నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావుకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బ్రాహ్మణ మరియు ఆర్యవైశ్య కుటుంబ సబ్యులను కలసి ఓట్లు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పాలూరి సత్యానందం, నూకల వీరన్న గొల కోటి వెంకటేశ్వర రావు, పాలూరి జేపి తదితరులు పాల్గొన్నారు.