కొత్తపేట: డిసి చైర్మన్ లను అభినందించిన ఎమ్మెల్యే బండారు
నీటి సంఘం డిస్టిబ్యూటరీ కమిటీ చైర్మన్ లుగా ఎన్నికైన కరుటూరి నరసింహారావు, చవల జగన్నాధం, మెర్ల గోపాలస్వామి లను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అభినందించారు. వాడపాలెం కార్యాలయం నందు మంగళవారం జరిగిన కార్యక్రమంలో చైర్మెన్ మరియు వైస్ ఛైర్మన్ లను ఎమ్మెల్యే సత్యానందరావు దుశ్శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.