పిఠాపురం - Pithapuram

పిఠాపురం: ఘనంగా క్రిస్మస్ సంబరాలు

పిఠాపురం: ఘనంగా క్రిస్మస్ సంబరాలు

పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా బుధవారం క్రిస్మస్ సంబరాలు ఘనంగా నిర్వహించారు. చర్చిలన్నీ విద్యుత్ దీపాల కాంతులతో దగదగా మెరిసాయి. పలు చర్చిలలో ఏసుక్రీస్తు జనన విధానాన్ని తెలియజేసేందుకు బాల యేసు రూపాన్ని పశువుల పాకలో రూపొందించి ప్రదర్శించారు. గొల్లప్రోలు పట్టణంలోని స్ధానిక బస్టాండ్ వద్ద గల బేతేలు ఆరాధన మందిరంలో పాస్టర్ జెకర్యా క్రిస్మస్ సందేశాన్ని అందించారు. చిన్నారులు మారుమనస్సు అనే నాటిక ప్రదర్శించి, అభినయ గీతాలు ఆలపించారు. అదే విధంగా జల్లూరులో యేసు కృపా దేవాలయం నందు పాస్టర్ జయశీల్ క్రిస్మస్ ప్రాముఖ్యతను వివరించారు.

వీడియోలు


జోగులాంబ గద్వాల జిల్లా