తునిలో భారీ అగ్ని ప్రమాదం
తునిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తుని పట్నం పెంటకోట రోడ్ లో ఉన్న శ్రీ పుష్పాంజలి బట్టల షాపులో కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భారీగా మంటలు ఎగసిపడడంతో షాప్ అంతా దగ్ధమైంది. షాప్ లో ఉన్న విలువైన బట్టలు పట్టుచీరలు రెడీమేడ్ వస్త్రాలు పూర్తిగా కాలిపోయాయి. వెంటనే ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేశారు. సుమారు కోట్ల రూపాయలులో ఆస్తి నష్టం జరిగినట్లు షాప్ యజమాని తెలిపారు.