వ్యక్తిని తొక్కి చంపిన ఏనుగు (వీడియో)

83చూసినవారు
చిత్తూరు జిల్లా రామకుప్పంలో విషాదం చోటు చేసుకుంది. పీఎంకే తండా పరిసరాల్లోకి వచ్చిన ఏనుగు ఓ వ్యక్తిపై దాడి చేసి తొక్కి చంపేసింది. అది గమనించిన స్థానికులు ఏనుగును తరిమేశారు. మృతుడు కన్నా నాయక్‌గా స్థానికులు గుర్తించారు. ఈ మేరకు అటవీ శాఖ పోలీసులకు సమాచారం అందించారు. ఏనుగులు జనావాసాల్లోకి రావడం భయాందోళనకు గురిచేస్తోందని స్థానికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్