పెనుగొండ మండలం వడలిలో శుక్రవారం జరిగిన రైతు సదస్సులో తహశీల్దార్ అనిత కుమారికి వినతిపత్రం అందజేశారు. సరిహద్దు రైతులు అంగీకరిస్తేనే సహచర రైతుల విస్తీర్ణంలో పొరపాట్లను సరిదిద్దవచ్చని, లేకుంటే వీలు పడదన్నారు. దీనికి రైతులు పూర్తి వ్యతిరేకమని పేర్కొన్నారు. డ్రోన్ సర్వే రద్దుచేసి పాత అడంగల్ ఎఫ్ఎంబీలను అనుసరించి కొలత, మ్యూటేషన్ ప్రక్రియ కొనసాగించాలని కూటమి నాయకులు కోరారు.