మోపిదేవి ప్రెస్ క్లబ్, పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో పాత్రికేయులు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని మోపిదేవి మండలం గృహ నిర్మాణ శాఖ ఏఈ రాజులపాటి తాండవ కృష్ణ ప్రశంసించారు. కోసూరు నాగమల్లేశ్వరరావు, సనకా వెంకట రాజేష్ ల ఆర్థిక సహకారముతో శుక్రవారం ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఏఈ తాండవ కృష్ణ ప్రారంభించారు.