భీమవరం సుందర పట్టణంగా మారేందుకు ప్రతి ఒక్కరు అభివృద్ధిలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్ క్యాంపు కార్యాలయంలో భీమవరం సుందరీకరణ పనులపై జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి, మున్సిపల్ అధికారులతో కలెక్టర్ సమావేశమై చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ, భీమవరం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ముందుకు రావాలని కోరారు.