భీమవరం పంచారామ క్షేత్రంలో కార్తీక శోభ

84చూసినవారు
భీమవరం పంచారామ క్షేత్రమైన శ్రీ ఉమా సోమేశ్వర జనార్ధన స్వామివారి దేవస్థానంలో కార్తీక మాస 4వ సోమవారం భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి పంచామృత అభిషేకం, అమ్మవార్లకు అర్చనాధికాలను జరిపించారు. అలాగే తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు పోటెత్తారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను చేశామని ఆలయ ఈవో రామకృష్ణంరాజు తెలిపారు.

సంబంధిత పోస్ట్