పశ్చిమగోదావరి జిల్లాలో 175 మద్యం దుకాణాలకు మంగళవారం సాయంత్రానికి 2, 658 దరఖాస్తులు అందాయని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఈనెల 11 వరకు దరఖాస్తు గడువును పొడిగించడం జరిగిందని అన్నారు. అలాగే 14న లాటరీ పద్ధతిలో దుకాణాలను కేటాయించి 16 నుంచి కొత్త దుకాణాల్లో విక్రయాలు ప్రారంభమవుతాయన్నారు.