ప. గో. జిల్లా కలెక్టరేట్ వద్ద సిపిఎం ధర్నా

77చూసినవారు
సిపిఎం ప్రజా పోరులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి సీపీఎం జిల్లా కార్యదర్శి బి. బలరాం మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అలాగే ట్రూ ఆప్ చార్జీలు తగ్గించి వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్తు మీటర్ల బిగింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్