భీమవరంలోని పాత బస్టాండ్ వద్ద ప్రయాణికుల కోసం షెల్టర్ ఏర్పాటు, జువ్వలపాలెం రోడ్డు అడ్డ వంతెన సమీపంలో బస్ షెల్టర్, ఏ ఎస్ ఆర్ నగర్ వాటర్ ట్యాంక్ ఆవరణలో పార్కు అభివృద్ధి కోసం జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి, మున్సిపల్ అధికారులతో కలిసి బుధవారం క్షేత్ర పరిశీలన నిర్వహించారు. ట్యాంక్ ఆవరణలో పార్కు సుందరీకరణానికి ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు.