విజయవాడ వరద బాధితులకు తణుకు ఆంధ్రా షుగర్స్ యాజమాన్యం సీఎం సహాయ నిధికి రూ. 2 కోట్లు విరాళాన్ని ప్రకటించింది. ఈ మేరకు సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ పెండ్యాల అచ్యుతరామయ్య గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అమరావతిలో కలిసి చెక్కును అందజేశారు. తమ వంతు సహాయంగా వరద బాధితులకు పది వేల ఆహార పొట్లాలను కూడా పంపిణీ చేసినట్లు యాజమాన్యం తెలిపింది.