ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమం దేశవరంలోని ప్రాథమిక పాఠశాలలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హెచ్ ఎమ్ అరుణ మాట్లాడుతూ పిల్లల విద్యావిధానం, మౌలిక వసతులు కల్పించడం, పేరెంట్స్ భాద్యతల గురించి వివరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ముగ్గుల పోటీలు నిర్వహించి, గెలుపొందిన తల్లులకు బహుమతులు అందజేశారు.