జంగారెడ్డిగూడెం మండలం వేగవరం శివారు జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అశ్వరావుపేట వైపు నుంచి వస్తున్న ఒక కారు అదుపుతప్పి వేగవరం జాతీయ రహదారి పక్కన ఉన్న దుకాణాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్నవారు సురక్షితంగా ఉన్నారు. కాగా నిద్రమత్తు కారణంగా ఈ ఘటన జరిగి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఈ ఘటనలో కారు ముందు భాగం పాక్షికంగా దెబ్బతింది.