భారీ వర్షాల నేపథ్యంలో చింతలపూడి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ఆదివారం తెలిపారు. అవసరమైతే తప్ప బయటికి రావద్దని కాచి చల్లార్చిన నీరు తాగాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందస్తుగా ఇతర ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా స్థానిక అధికారులకు, కూటమి నాయకులకు, తనకు 9996368999 నంబర్లో సంప్రదించాలని కోరారు.