చింతలపూడి నుండి సీతానగరం వెళ్లే ప్రధాన రహదారిలోని స్థానిక వాటర్ ట్యాంకు వద్ద రహదారి అద్వానంగా మారడంతో ప్రయాణికులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రహదారిపై ఉన్న గోతుల్లో వర్షపు నీరు నిలిచిపోయి వాహన రాకపోకలు సాగించేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కావున అధికారులు వెంటనే స్పందించి రహదారికి పూర్తిస్థాయిలో మరమ్మత్తులు చేపట్టాలని కోరుతున్నారు.