ఏలూరు జిల్లాలోని కొల్లేరులో రోజురోజుకూ నీటి మట్టం పెరుగుతోంది. సాధారణ రోజుల్లో 2 మీటర్లు ఉండగా. గురువారం సాయంత్రానికి 3. 20 మీటర్లకు చేరుకుంది. ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 2020లో ఇలానే కొల్లేరు క్రమంగా ఉగ్రరూపం దాల్చింది. అప్పుడు నీటి మట్టం 3. 50 మీటర్లుగా నమోదైంది. మరో 30 సెంటీమీటర్లు పెరిగితే తీరగ్రామాలు ముంపులో చిక్కుకున్నట్టే.