అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. ఏలూరు ఆశ్రమ మెడికల్ కళాశాలకు చెందిన 14 మంది వైద్య విద్యార్థులు మారేడుమిల్లి జలతరంగిని జలపాతాన్ని సందర్శించేందుకు వచ్చారు. వీరిలో ఐదుగురు విద్యార్థులు ప్రమాదవశాత్తు జలపాతంలో పడిపోగా స్థానికులు ఇద్దరిని కాపాడారు. మరో ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఇద్దరు యువతులు, ఒక యువకుడు ఉన్నారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.