గన్నవరం స్థానిక ప్రెస్ క్లబ్ వద్ద శనివారం గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ముఖ్యఅతిథిగా ఏపీయూడబ్ల్యూజే 67వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఏపీయూడబ్ల్యూజే జండాను ఎమ్మెల్యే యార్లగడ్డ ఆవిష్కరించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు ఫలహారాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా ఏపీయూడబ్ల్యూజే ఉపాధ్యక్షులు అట్లూరు రాజశేఖర్, పాత్రికేయ మిత్రులు పాల్గొన్నారు.