మంచి చేస్తే ఓటు వేయ‌మ‌న్నాడు...జ‌గ‌న్ పాల‌న‌లో మంచి ఎక్క‌డ వుంది. అంతా విధ్వంస‌మే

25881చూసినవారు
మంచి చేస్తే ఓటు వేయ‌మ‌న్నాడు...జ‌గ‌న్ పాల‌న‌లో మంచి ఎక్క‌డ వుంది. అంతా విధ్వంస‌మే
మంచి చేస్తే ఓటు వేయ‌మ‌న్నాడు...జ‌గ‌న్ పాల‌న‌లో మంచి ఎక్క‌డ వుంది. అంతా విధ్వంస‌మే : టిడిపి ఎంపి అభ్య‌ర్ధి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)
*న‌వాబు పేట, భీమ‌వ‌రం గ్రామాల్లో ఎన్నిక‌ల ప్ర‌చారం
*శ్రీరాం రాజ‌గోపాల్ తాతాయ్య‌తో క‌లిసి పాల్గొన్న కేశినేని శివ‌నాథ్
* నాయ‌కుల‌కి బ్ర‌హ్మార‌ధం ప‌ట్టిన గ్రామ ప్ర‌జ‌లు
*ప‌సుపు చీర‌లు క‌ట్టి ర్యాలీలో పాల్గొన్న మ‌హిళ‌లు
*ప‌సుపుమ‌యం గా మారిన గ్రామ వీధులు
*గ్రామాల్లో ఉప్పొంగిన ఉత్సాహం
*సైకో పోవాలి, సైకిల్ రావాలంటూ నినాదాలు

జ‌గ్గ‌య్య‌పేట : జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌లో చేసిన మంచి, అభివృద్ది భూతాద్దం వేసి వెతుకోవాలి. త‌ను మంచి చేస్తేనే ప్ర‌జ‌ల‌కు ఓటు వేయాల‌ని అడుగుతున్నాడు. అస‌లు చేసిన మంచి ఎక్క‌డ వుంది. అధికారంలోకి రాగానే ప్ర‌జావేదిక కూలివేత‌తో మొద‌లుపెట్టిన విధ్వంసం ఇప్ప‌టి వ‌ర‌కు కొన‌సాగుతూనే వుంది. ప్ర‌శ్నిస్తే ఎస్సీ, ఎస్టీల‌పైనే ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసులు పెట్టించిన దుర్మార్గ‌పు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రెడ్డి అని బిజెపి, జ‌న‌సేన బ‌ల‌ప‌రిచిన టిడిపి విజ‌య‌వాడ పార్ల‌మెంట్ ఎంపి అభ్య‌ర్థి కేశినేని శివనాథ్ అన్నారు. జ‌గ్గ‌య్య పేట నియోజ‌క‌వర్గం పెనుగంచిప్రోలు మండ‌లంలో న‌వాబ్ పేట‌, వ‌త్స‌వాయి మండ‌లంలో భీమ‌వ‌రం గ్రామంలో ఎన్నిక‌ల ప్ర‌చారం శుక్ర‌వారం జ‌రిగింది . ఈ ప్ర‌చార ర్యాలీ లో కేశినేని శివ‌నాథ్, జ‌గ్గ‌య్య‌పేట టిడిపి ఎమ్మెల్యే అభ్య‌ర్థి శ్రీరాం రాజ‌గోపాల్ తాతాయ్య‌, ఎన్టీఆర్ జిల్లా అధ్య‌క్షుడు నెట్టం ర‌ఘురామ్ తో క‌లిసి పాల్గొన్నారు.

న‌వాబ్ పేట‌, భీమ‌వ‌రం గ్రామ ప్ర‌జ‌లు నాయ‌కుల‌కి ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. మ‌హిళ‌లు ప‌సుపు చీర‌లు క‌ట్టి ర్యాలీలో పాల్గొన్నారు. యువ‌త ప‌సుపు జెండాలు చేత‌ప‌ట్టి సైకో పోవాలి, సైకిల్ రావాలంటూ నినాదాలు చేశారు. ఈ రెండు గ్రామాల్లో ప్ర‌చార ర్యాలీ జ‌రిగిన‌ప్పుడు గ్రామ ప్ర‌జ‌ల్లో ఉత్సాహం ఉప్పొంగింది. నవాబ్ పేట‌లో మేరీమాత కాల‌నీ, బిసి కాల‌నీ, ఎస్సీ కాల‌నీలో , భీమ‌వ‌రం గ్రామంలో ఎస్సీ కాల‌నీలో ఎన్నిక‌ల ప్ర‌చారం జ‌రిగింది.

ఈ సంద‌ర్బంగా కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ ఏ ముఖ్య‌మంత్రి అయినా ఎంత‌కొంత అభివృద్ది చేస్తాడు. జ‌గ‌న్ పాల‌న‌లో రాష్ట్రం ముఫ్పై ఏళ్ల వెన‌క్కి వెళ్లింది. అభివృద్ది లో వెన‌క‌బ‌డిన రాష్ట్రాన్ని తిరిగి ముందుకు తీసుకు వ‌చ్చే స‌మ‌ర్ధ‌త‌, సామ‌ర్థ్యం చంద్ర‌బాబు నాయుడుకే వుంద‌న్నారు. ప్ర‌జావేదిక కూల్చివేశాడు. అమ‌రావ‌తి శిధిలం చేశాడు. పోల‌వ‌రం పూర్తి చేయ‌లేదు. వేద్రాద్రి కంచ‌ల ఎత్తిపోత‌ల ప‌థ‌కం మ‌ర్మ‌మ‌త్తులు పూర్తి చేయ‌లేదు. జ‌గ్గ‌య్య‌పేట నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు ఈ సైకో ప్ర‌భుత్వం తాగునీరు, సాగునీరు పంపిణీ చేయ‌లేక‌పోయింది.

దోచుకోవ‌టం, దాచుకోవ‌టం మాత్ర‌మే తెలిసిన జ‌గ‌న్ ఇప్పుడు దోచుకోవ‌టానికి కొత్త చ‌ట్టం తెచ్చాడు. అదే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ..ఈ చ‌ట్టంతో పేద‌వాడి భూమ‌లు లాక్కోవ‌టానికి ప్ర‌య‌త్నిస్తున్నాడ‌న్నారు. జ‌గ‌న్ కి ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని మూడు ముక్క‌లు చేయ‌టానికి ప్ర‌యత్నించాడు. మ‌రోసారి అధికారంలో వ‌స్తే..రిషికొండ‌కు గుండు కొట్టిన‌ట్లు రాష్ట్ర ప్ర‌జ‌లందరికీ గుండు కొట్టించి సున్నం రాస్తాడ‌ని తెలిపారు. ఈ విష‌యం అర్ధం చేసుకున్న‌ప్ర‌జ‌లు చంద్ర‌బాబు ను ముఖ్యమంత్రిగా అసెంబ్లీకి పంపించేందుకు సిద్దంగా వున్నార‌ని తెలిపారు. జ‌గ‌న్ అర‌చాకాలు విసుగు చెందిన ప్ర‌జ‌ల‌తోపాటు వైసిపి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు కూడా ఎన్డీయే కూట‌మి అధికారంలోకి రావాల‌ని కోరుకుంటున్నార‌ని తెలిపారు. న‌వాబ్ పేట‌లో హైస్కూల్ , బిసి క‌మ్యూనిటీ హాల్ నిర్మాణం అధికారంలో రాగానే తాతయ్య‌, నెట్టెం ర‌ఘురామ్ తో క‌లిసి ఏర్పాటు కృషి చేస్తాన‌ని శివ‌నాథ్ తెలిపారు.

ఇక తాతయ్య మాట్లాడుతూ అమ‌రావ‌తి రాజ‌ధానిగా కావాలంటే చంద్ర‌బాబు ముఖ్యమంత్రి కావాల‌న్నారు. ప్ర‌తి గ్రామాన్ని అభివృద్ది చేసి చూపిస్తాన‌న్నారు. గ‌తంలో లైట్లు,రోడ్లు వేశాము.. ఈ సారి డ్రైనేజీ స‌మ‌స్య ప‌రిష్క‌రిస్తాన‌ని, అలాగే తాగునీటి స‌మ‌స్య‌కు శాశ్వ‌త ప‌రిష్కారం చూపిస్తాన‌ని తెలియ‌జేశారు.


ఈ కార్య‌క్ర‌మంలో పెనుగంచిప్రోలు మండ‌ల పార్టీ అధ్య‌క్షుడు చింత‌ల సీతారామ‌య్య‌, న‌వాబు పేట గ్రామ‌పార్టీ అధ్య‌క్షుడు గింజుప‌ల్లి వెంక‌ట‌య్య‌, జ‌న‌సేన పార్టీ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త బాడిశ మురళీకృష్ణ‌, జ‌న‌సేన మ‌హిళ నాయ‌కురాలు రామిశెట్టి తిరుమ‌ల‌దేవి, బిజెపి మ‌హిళ నాయ‌కురాలు క‌ల్లూరి శ్రీవాణి, జిల్లా మ‌హిళ మోర్చా అధ్య‌క్షురాలు కృష్ణ‌కుమారి, వ‌త్స‌వాయి మండ‌ల‌పార్టీ ప్రెసిడెంట్ వ‌డ్ల‌మూడి రాంబాబు, వ‌త్స‌వాయి గ్రామ పార్టీ అధ్య‌క్షుడు షేక్ మ‌జీద్, గ్రామ పార్టీ నాయ‌కులు ఇంజం రామారావు, కొత్త వైకుంఠ‌రావు లతో పాటు టిడిపి, బిజెపి, జ‌న‌సేన మండ‌ల‌పార్టీ, గ్రామ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్