కైకలూరు లో వైద్యుల నిరసన

68చూసినవారు
కోల్ కత్తా జూనియర్ వైద్యురాలిపై హత్యాచారంపై నిరసనగా ఐఎంఏ పిలుపు మేరకు శనివారం కైకలూరు లో అనుభవ వైద్యులు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. నల్లబ్యాడ్జీలు, ప్లకార్డులతో నిరసన తెలిపారు. అనంతరం ర్యాలీగా తరలివచ్చి తాలూకా సెంటర్ లో మానవహారం నిర్వహించి నినాదాలు చేశారు. వైద్యులు ప్రశాంతి, సురేఖ, మెడి కేర్, వర సంజీవిని వైద్యులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్