ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ శుక్రవారం మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కుటుంబ సభ్యులతో కలిసి మంగళగిరిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మనవడి వివాహానికి హాజరుకావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు. అనంతరం ఇరువురు కాసేపు పలు విషయాలపై చర్చించుకున్నారు.