ముదినేపల్లిలోని పరంజ్యోతి కల్కి అమ్మభగవాన్ వరసిద్ది ఆలయంలో గురువారం అష్టలక్ష్మి కలశ పూజ వైభవంగా నిర్వహించారు. పద్మావతి అమ్మవారి జన్మదినం సందర్భంగా కలశపూజ, నవదాన కార్యక్రమం నిర్వహించారు. పరంజ్యోతి మానవ సేవా సమితి ఆధ్వర్యంలో గర్భిణీలకు సీమంతాలు నిర్వహించారు. పేద బ్రాహ్మణ దంపతులకు వస్త్రదానం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అన్నదానం భక్తులు పెద్దసంఖ్యలో అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.