నరసాపురం పట్టణం 18వ వార్డులోని 9వ సచివాలయాన్ని మున్సిపల్ కమిషనర్ ఎం. అంజయ్య శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ క్రమంలో సచివాలయంలో పని చేస్తున్న ఉద్యోగుల అటెండెన్స్ రిజిస్టర్, మూమెంట్ రిజిస్టర్, అన్ని పథకాల అర్హులు, అనర్హులు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.